Showing posts with label anushka married. Show all posts
Showing posts with label anushka married. Show all posts

Wednesday, 2 September 2015

Bollywood Actresses Anushka has got married for 5 times

 

 

అనుష్కకు వివాహమైంది. అదీ ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా ఐదుసార్లు. దీనికి అనుష్క కూడా అవుననే చెపుతోంది. అయితే, ఈ ఐదుసార్లూ పత్రికల వారే పెళ్లి చేశారంటూ చెప్పి ఇందులోని ట్విస్ట్‌ను తొలగించింది. తెలుగులో కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త అర్థం చెప్పిన హీరోయిన్ అనుష్క. అందం, అభినయం ఆరడుగుల పోత. గ్లామర్‌ పాత్రలతో తెరపై ఝుమ్‌ఝుమ్‌మాయ చేయటమే కాదు… జేజమ్మ, దేవసేన, రుద్రమదేవిలాంటి సాహసపాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ సిల్వర్ స్క్రీన్ స్టార్. ఈ ముద్దుగుమ్మ ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు ఐదుసార్లు వివాహమైనట్టు చెప్పింది.
తన గురించి రూమర్స్, గాసిప్స్ వచ్చినపుడు, వాటిని విన్నప్పుడు చాలా స్టుపిడ్‌గా అనిపిస్తుంది. అప్పుడు అమ్మానాన్నలతో మాట్లాడతాను. ఎవ్వరి గురించి ఆలోచించ వద్దని చెబుతారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా రాత్రి పడుకునే సమయంలో మన కాన్షియస్‌ క్లీన్‌గా ఉండాలి. అమ్మ ఎప్పుడూ ఇదే చెబుతుంది. రూమర్స్‌, గాసిప్స్‌ ఎన్నో వస్తుంటాయి. వాటిని పట్టించుకోను. మనపైన మనకు నమ్మకం ఉండాలి. నా గురించి గాసిప్స్‌ రాసే వాళ్లపై నాకు కోపం రాదు. ఫీల్‌ అవుతాను. నా దృష్టిలో వాళ్ల స్థాయి తగ్గిపోతుంది. నాపై వచ్చే రూమర్స్‌ చదవనని కాదు. పేపర్‌ తప్పకుండా చదువుతాను. ఇప్పటికి నాకు ఐదు సార్లు పెళ్లి చేశారు. అలాంటి వార్తలు చదివి నవ్వుకుంటాను అంతే. అయితే కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి. ఇక తన పెళ్లి అంటారా.. ఏదో ఓ రోజున అవుతుంది. ఆ టైమ్‌ వచ్చినప్పుడు మ్యాజికల్‌గా జరిగిపోతుంది. వరుణ్ణి నేనే సెలెక్ట్‌ చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాక నా భర్తతో కలిసి వరల్డ్‌ ట్రావెల్‌ చేస్తాను. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను. అలాగే ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నాగార్జున, దర్శకుడు రాజమౌళి గారి ఫ్యామిలీలతో క్లోజ్‌గా ఉంటాను.