ఆరుకోట్ల ఉంగరాన్ని కోట్టెసిన హీరోయిన్
ఆరుకోట్ల ఉంగరాన్ని హీరోయిన్ కోట్టెసింది. వినడాన్నికి విడ్డూరంగా ఉన్న
ఇది నిజం. కాకపోతే ఇది కోట్టెసింది ఎవరో తెలుసా…’గజిని’ సినిమాతో టాప్
హీరోయిన్ మారిపోయి బాలీవుడ్లో తన అదృష్టని పరిక్షించుకున్న చిన్నది.
ఇప్పటికే అర్థం అయి ఉండాలి మీకు..అదేనండి కేరళ చిన్నది అసిన్. ముంబయికి
చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్ ప్రేమాయణం కోనసాగిస్తున్న విషయం
తెలిసిందే. అసిన్ త్వరలో అతనితో పెళ్లికి సిద్ధమవుతోంది. ఇరు కుటుంబాలకు
చెందిన పెద్దలు వీరి ప్రేమకు ఆగీకరించడంతో త్వరలో ఈ ప్రేమజంట పెళ్లి
పీటలెక్కబోతోంది. ఈ ప్రేమజంట కు నిశ్చితార్థం జరపాలని పెద్దలు
నిశ్చయించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే నిశ్చితార్థానికి ముందే
అసిన్‌కు ఆరు కోట్లు విలువ చేసే వజ్రాల ఉంగరాన్ని రాహుల్ శర్మ బహుమతిగా
ఇచ్చినట్టు తెలిసింది. బెల్జియం నుంచి తెప్పించిన ఈ ఉంగరంపై అసిన్, రాహుల్
అని అర్థం వచ్చే విధంగా ఎఆర్ అనే అక్షరాలను డైమండ్స్‌తో పొందుపరిచినట్టు
అసిన్ సన్నిహితులు అంటున్నారు. తన ప్రేమను వ్యక్తంచేసిన సందర్భంలోనే ఖరీదైన
బంగారు ఉంగరాన్ని అసిన్‌కు అందజేసిన రాహుల్‌శర్మ తాజాగా ఆరు కోట్లు
విలువచేసే డైమండ్ రింగ్‌ను కానుకగా ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారంట. గత
కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రేమజంట వివాహం త్వరలో
సంప్రదాయబద్ధ్దంగా ఒకటి కానుంది.
No comments:
Post a Comment