Wednesday, 16 September 2015

Brahmanandanam As PK

 

సీనియర్ నటుడు, హస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు పీకే పాత్రలో నటించనున్నాడు. పీకే చిత్రంలో అమీర్‌ఖాన్ గెటప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. తన విలక్షణ వస్త్రధారణతో అమీర్‌ఖాన్ తెరపై కనిపించిన విధానం సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచింది. తాజాగా ‘గరం’ అనే తెలుగు చిత్రంలో పీకే గెటప్‌లో బ్రహ్మానందం కనిపించనున్నారు. తన నటనకౌశల్యంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిన ఆయన తాజాగా పీకే గెటప్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరుచనున్నాడు. పైన కోటుతో, క్రింద అమ్మాయిల మాదిరిగా స్కర్ట్ ధరించి భుజానికి రేడియో తగిలించుకొని పీకే గెటప్‌లో బ్రహ్మానందంతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను చిత్ర హీరో ఆది ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు సోషల్‌మీడియాలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పీకే గెటప్‌లో కనిపిస్తారని, ఆయన పాత్ర అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

No comments:

Post a Comment