Sunday, 13 September 2015

రన్నింగ్ రైల్లోంచి యువకుడ్ని తోసేసిన టీసీలు

 

కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడ్ని తోసేసారు టీసీలు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కోసికలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సంజయ్ రాథోడ్ ఝాన్సీ నుంచి ఆగ్రా వెళ్లేందుకు యూపీ జన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన టిక్కెట్టును తనిఖీ అధికారులు (టీసీలు) తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దుర్ఘటనలో బాధితుడు కాలును కోల్పోయాడు. ఈ దుర్ఘటన జరగడానికి టీసీలే కారణమని సంజయ్ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆ సమయంలో ఆ మార్గంలో విధులు నిర్వర్తించిన వారిని విచారిస్తామని రైల్వే మేనేజరు వెల్లడించారు. ఘటనపై అక్కడి నేతలు మాట్లాడుతూ ఇది చాలా క్రూరమైన నేరమని, రైలు నుంచి తోసేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని అసెంబ్లీ పేర్కొంది.

No comments:

Post a Comment