భర్యకు భరణంగా కోట్లు ఇవ్వనున్న సుదీప్
కన్నడ స్టార్ హీరో సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నుంచి శుక్రవారం
విడాకులు పొందాడు. గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య సయోద్య లేకపోవడం గొడవలు
రేకెత్తడంతో… ఇరువురు విడాకులకు అప్లై చేసుకొన్నారు. ఈ విడాకులకు గానూ
సుదీప్ తన భార్యకు భరణంగా రూ.19 కోట్ల ను చెల్లించనున్నాడు. అంతేకాదు
సుదీప్ వీరి కూతురు రక్షత సంరక్షణ బాధ్యత కూడా భార్య ప్రియ కే అప్పగించాడు.
కన్నడ హీరో సుదీప్ ఈగ సినిమా తో ఎంట్రీ ఇచ్చి.. బాహుబలి సినిమాలో ప్రముఖ
పాత్ర ను పోషించి తెలుగులోనూ పేరు సంపాదించుకొన్నాడు. ఇక కన్నడం లో స్వీయ
దర్శకత్వంలో తెలుగు సూపర్ హిట్ మూవీస్ మిర్చి, యముడు, అత్తారింటికి దారేది
సినిమాలను రూపొందించి భారీ విజయాలను నమోదు చేశాడు. కాగా ఈ దంపతుల విడాకులకు
సరైన కారణాలు మాత్రం తెలియడం లేదని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారని తెలియవస్తుంది.
No comments:
Post a Comment