Friday, 28 August 2015

ఆ హీరోని అన్నయ్యగా ఊహించుకోలేనన్న హీరోయిన్

 

హీరోయిన్ ఇలియానా రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ తాను నిజ జీవితంలో ఏ హీరోనీ అన్నయ్యగా ఊహించుకోలేను అని, ముఖ్యంగా బాలీవుడ్ కలల రాకుమారుడు రణబీర్ కపూర్ ని అస్సలు అన్నయ్యగా ఊహించుకోలేనని చెప్పింది. ఇంకా తన షాపింగ్ అలవాట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను అందర్లాంటి ఆడపిల్లనే, ఓ సాధారణ అమ్మాయిలాగే షాపింగ్ చేస్తాను, పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీ షాపుల వరకు అన్నింట్లో షాపింగ్ చేస్తాను. అందులోనూ బేరమాడి కొనుక్కోవడం అంటే నాకు మరీ మరీ ఇష్టం’ అని చెప్పుకొచ్చింది ఇలియానా.
రీసెంట్ గా ఇలియానా సెక్స్ గురించి చేసిన కొన్ని హాట్ స్టేట్ మెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాయట. సెక్స్ పట్ల అవగాహాన తెచ్చుకోవడం మంచిదని, ఇండియాలో సెక్స్ ని వేరే కోణం నుంచి చూసేవారు ఎక్కువని చెప్పుకొచ్చిందట ఇలియానా. తెలుగులో లో నెంబర్ వన్ పొజీషన్ లో ఉండగానే, బాలీవుడ్ కి వలస వెళ్లింది ఈ స్లిమ్ బ్యూటీ.

No comments:

Post a Comment