Showing posts with label flowers rain on asin. Show all posts
Showing posts with label flowers rain on asin. Show all posts

Thursday, 27 August 2015

Flowers Rain on Asin


చెన్నై బ్యూటీ ఆసిన్, మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్‌శర్మ మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆదివారం ఆసిన్‌పై రాహుల్ పూల వర్షం కురిపించారు. ఆసిన్‌కు రాహుల్ వివిధ రకాల గులాబీలతో కూడిన పూలను పంపించి తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆసిన్ ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆసిన్‌కు, రాహుల్‌కు మధ్య సంబంధం ఏర్పడటానికి సహకరించింది కామన్ ఫ్రెండ్ అయిన అక్షయ్ కుమార్ అని తెలిసింది.


అక్షయ్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా మైక్రోమ్యాక్స్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నారు. అక్షయ్, ఆసిన్ కలిసి ఖిలాడి 786 చిత్రంలో నటించారు. ఆసిన్ నటించిన ఆల్ ఈజ్ వెల్ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. దీంతో ఆసిన్ కమిట్‌మెంట్స్ పూర్తవుతాయి. ఇక త్వరలోనే పెళ్లి ఎప్పుడనే వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.