Showing posts with label need fruits for women. Show all posts
Showing posts with label need fruits for women. Show all posts

Friday, 28 August 2015

మహిళలకు కావాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు..

 

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి కావలసింది సమతులాహారం.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. స్త్రీ, పురుషుడు అని తేడా లేకుండా ప్రతి స్టేజిలో న్యూట్రిషన్ ఫుడ్ అవసరమవుతుంది. కానీ ఇంటిపనులను చూసుకొంటూ, పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్నీ పనులు చేయడం, ప్రతీ రోజూ చేస్తూ అలసి పోయే స్త్రీలకుతమ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం పదార్థాలు …బీన్స్ ,పాలు, ఓట్స్ ,అవిసె గింజలు,టొమాటో,చేపలు ,తోటకూర,కెరోటినాఎడ్స్,క్యారోట్,కాలి ఫ్లవర్స్