అమెరికా చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులు
హైజాక్ చేసిన విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దారి చేసి నేటికి సరిగ్గా
14 సంవత్సరాలు. ఈ టెర్రర్ అటాక్ అమెరికాను ఉలిక్కి పడేటట్టు చేసింది.
ఉగ్రవాదుల శక్తేంటో ప్రపంచానికి తెలిపిన రోజిది. ట్విన్ టవర్స్ పై దాడులు
జరిగింది ఇవాళే. అల్ ఖైదా అధినేత లాడెన్ దీనికి కారణమని భావిస్తారు. ఈ
మారణ హోమం ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ఉగ్రదాడి. ఈ ఘటనలో 2700 మంది
చనిపోయారు. ఇక్కడి శకలాలను తీయడానికి ఆరు నెలలు పట్టింది. టెర్రరిజం
గురించి ప్రపంచం ఆలోచనలను ఈ సంఘటన మార్చేసింది.
డబ్ల్యూటీసీ భవనాలపై జరిగిన ఈ దాడిలో.. దాదాపు 3 వేల మంది చనిపోయినట్టు
అప్పట్లో అమెరికా తెలిపింది. దాడి జరిగిన సమయంలో.. భవనాల్లో ఉన్న మొత్తం
లక్ష మందిలో.. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదాన్ని సీరియస్ గా
తీసుకున్న అమెరికా… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. దాడికి ప్రధాన కారకుడైన
అప్పటి అల్ కాయిదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను తుద ముట్టించేదిశగా పావులు
కదిపింది. అల్ కాయిదాను అంతమొందించడమే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ గా
పెట్టుకున్న అమెరికా అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ దేశాల్లో ఉగ్రవాద
స్థావరాలపై విరుచుకుపడింది. వరుస దాడులతో ఒసామా బిన్ లాడెన్ ను కార్నర్
చేసింది. చివరికి 2011లో టార్గెట్ రీచ్ అయిన అమెరికా బలగాలు అధ్యక్షుడు
ఒబామా ఆదేశాలతో లాడెన్ ను అంతమొందించాయి.