వృద్దాప్యాన్ని నివారించేవి..

1. ద్రాక్షపండ్లు
ద్రాక్షపండ్లు విటమిన్ ‘C’ లను అధికంగా కలిగి ఉంటాయి మరియు సూర్యరశ్మి వలన
చర్మానికి కలిగే ప్రమాదాన్ని నివారిస్తాయి. ద్రాక్షపండ్లు విత్తనాల నుండి
తయారు చేసిన రసంలో ‘ఎల్లాజిక్ ఆసిడ్’ మరియు ‘పూనిక్ ఎలాజిక్’లను కలిగి
ఉంటుంది. ఇందులో ఉండే మొదటి ‘ఫాలిఫినాల్’ మూలకం శరీరంలో చేరిన
ఫ్రీరాడికల్’లతో పోరాడుతుంది, రెండవది శరీరానికి అవసరం అయ్యే పోషకాలలో
ముఖ్యమైనది మరియు శరీరంల్లో కోల్లాజన్ గ్రహించుటను అధికం చేస్తుంది, ఈ చర్మ
కణాలలో మధ్య ఉండే కణాలు చర్మాన్ని సున్నితంగా, మృదువుగా ఉండేలా చేస్తాయి.
2. గ్రీన్ టీ
గ్రీన్ టీలో క్యాటేచిన్స్, పాలీఫినాల్స్’లను ఉంటాయి. చర్మ కణాలు సూర్యరశ్మి
వలన కలిగే నష్టాలు అనగా హైపర్ పిగ్మేంటేషన్’కు గురవకుండా క్యాటేచిన్స్
సహాయపడతాయి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్’లు శరీరంలో
ఫ్రీ రాడికల్’ల వలన కలిగే ప్రమాదాలను మరియు వాటి వలన కలిగే చర్యలను (వయసు
మళ్లటం) వ్యతిరేకిస్తుంది.
3. పుచ్చపండు
పుచ్చపండు అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్’లను, విటమిన్ ‘C’, లైకోపీన్ మరియు
పొటాషియంలను కలిగి ఉంటుంది. ఇవి శరీర కణాలలో కావలసిన పోషకాలను మరియు నీటిని
నిర్వహిస్తుంది .
4. ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్’లో ఉండే ఫాట్’లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం; ఆలివ్ ఆయిల్’లో
గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లను కలిగి ఉండి, రక్త ప్రసరణను
మెరుగుపరుస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
5. స్పీనాచ్
ఈ ముఖ్యమైన ఆహర పదార్థాలు ప్రత్యేక ఫైటో న్యూట్రిఎంట్ మరియు యాంటీ
ఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటాయి, ఇవి సూర్యరశ్మి వలన కలిగే ప్రమాదాల
నుండికాపాడుతాయి . స్పీనాచ్ బీటా కేరోటీన్ మరియు ల్యూటీన్’లను పుష్కలంగా
కలిగి ఉంటాయి, ‘జర్నల్ అఫ్ అగ్రికల్చర్ ఫుడ్ కెమిస్ట్రీ’ ప్రకారం ఈ రెండు
పోషకాలు చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచుతాయి.
6. బ్లూబెర్రీస్
చిన్న పరిమాణంలో ఉండే ఈ పండ్లు ఇతర ఆహర పదార్థాల కన్నా ఎక్కువ మొత్తంలో
యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్,
మానసిక ఒత్తిడి, అంతేకాకుండా వ్యాయామాల వలన కలిగే ప్రమాదాల నుండి రక్షణ
కల్పిస్తాయి.
7. హోల్ గ్రైన్స్
హోల్ గ్రైన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు మధుమేహ వ్యాధి
గ్రస్తులలో జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. ఇవి ఎక్కువ మొత్తంలో
ఫైబర్, మినరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉండి, వయసు మీద పడే
సమస్యలను ఆలస్యం చేస్తాయి. అంతేకాకుండా, గుండె సంబంధిత వ్యాధులు మరియు
క్యాన్సర్ కారకాలను తగ్గిస్తాయి.
8. టమాటా
టమాటాలు ‘లైకోపీన్’, యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉండి, కొన్ని రకాల
క్యాన్సర్ కారకాలకు వ్యాతిరేఖంగా పని చేయటమే కాకుండా, చర్మ కణాలను ఆరోగ్యకర
స్థాయిలో ఉంచి, కణాలు ప్రమాదానికి గురవటాన్ని నివారిస్తాయి ముఖ్యంగా ఇవి
పౌరుష గ్రంధి, ఊపిరితిత్తులు మరియు స్టమక్ క్యాన్సర్’లకు వ్యతిరేకంగా
పోరాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది.
9. కారపు ఆహారాలు
పసుపు మరియు అల్లం వంటివి యాంటీ ఇన్ఫ్లమేషన్ మూలకాలను కలిగి ఉండి, చర్మ
సంబంధిత వ్యాధులను, సమస్యలను, ముఖ్యంగా అల్జామేర్స్ వంటి వ్యాధులను రాకుండా
చేస్తుంది. అల్లం మరియు ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారకాలు గుండె
సంబంధిత మరియు క్యాన్సర్’ల నుండి కాపాడతాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కర
స్థాయిలను తగ్గిస్తాయి.
No comments:
Post a Comment