Showing posts with label
Gabriella and nagarjuna movie.
Show all posts
Showing posts with label
Gabriella and nagarjuna movie.
Show all posts

తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున సరసన నటించే అవకాశం వస్తే ఏ
హీరోయిన్ అయిన ఎగిరి గంతెస్తుంది. 50 ఏండ్ల వయసులో కూడా మన్మథుడుల ఉండే
నాగ్తో జత కట్టే అవకాశం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని హీరోయిన్స్
ఎదురుచూస్తూ ఉంటారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్లో ఉన్న కూడ చాలా
మంది హీరోయిన్స్ ఆ అదృష్టాన్ని ఇంకా దక్కించుకోలేకపోయారు. అలాంటిది
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలి నాళలోనే ఆ అవకాశం దక్కితే ఆ ఆనంద ఏవిదంగా
ఉంటుదో దక్షిణాఫ్రికా మోడల్, నటి గాబ్రియెల్లా దిమిత్రిడేస్ ను చూస్తే
అర్థమౌతుంది. సినీ పరిశ్రమకు వచ్చిన కొద్ది కాలంలోనే నాగార్జునతో కలిసి
నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అని పొంగిపోతోంది ఈ దక్షిణాఫ్రికా
మోడల్. గతంలో సోనాలి కేబుల్ అనే హిందీ చిత్రంలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు
నాగార్జున సరసన హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ – కార్తీ కాంబోలో
తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ దక్షణాప్రికా
సుందరి. తెలుగు-తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమౌతున్న ఈ చిత్రాన్ని పీవీపీ
సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.
సినిమా గురించి గాబ్రియెల్ తన అనుభవాలు తెలియజేస్తూ ‘ఇది నాజీవితంలో
నెరవేరిన కల. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జున లాంటి హీరోతో పనిచేసే అవకాశం
రావడం చాలా అదృష్టమని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర
పోషిస్తున్నాను. ఇంతకుమించి సినిమా వివరాలు తెలియజేయలేను’తన ఆనందాన్ని
వ్యక్త పరిచింది.