జూడో ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వస్తున్న జాతీయ స్థాయి క్రిడాకారిణి
గ్యాంగ్ రేప్ కు గురయింది. తన జూడో కోచ్, మరో స్నేహితురాలితో వస్తున్న
సమయంలో ఈ ఘటన జరగడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ శివారు గుర్గావ్ లో ఈ
దారుణం జరిగింది. 15 ఏళ్ల జూడో క్రీడాకారిణి మరో స్నేహితురాలితోపాటు ఇంటికి
వెళ్తోంది. ఇంతలో వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. దాడి నుంచి
తప్పించుకోవడానికి ఆటుగా వచ్చిన యువకుల బైకులపై బాలికలు ఎక్కారు.
కొద్దిదూరం ప్రయాణించాక స్నేహితురాలిని కిందికి దించేశారు. నోరు మూసుకుని
ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. జూడో క్రీడాకారిణిని మాత్రం తమతోపాటు ఓ
నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెకు మత్తు ఇచ్చి అత్యాచారానికి
పాల్పడ్డారు. జరిగినదానికి బెదిరిపోయి అత్యాచారం విషయం కుటుంబ సభ్యులకు
చెప్పకుండా గోప్యంగా ఉంచింది. అయితే… ఇటీవల అదే యువకులు తనను మళ్లీ
అనుసరించడంతో… భయంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. వారు ఆమె
తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంట నే పోలీసులకు
ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దీనిపై కేసు నమోదు చేసి… నిందితుల వేట
ప్రారంభించారు. అత్యాచారం చేసిన ముగ్గురిలో ఒకడైన 22 ఏళ్ల కార్తీక్‌ను
అరెస్టు చేశారు. అతను ఎంబీఏ చదువుతున్నాడని, అతని స్నేహితులైన మరో ఇద్దరు
నిందితులు పరారీలో ఉన్నారు.