Showing posts with label Gemini has Taken Junior N.T. R. Sukumar Movie satellite Rites. Show all posts
Showing posts with label Gemini has Taken Junior N.T. R. Sukumar Movie satellite Rites. Show all posts

Thursday, 3 September 2015

Gemini has Taken Junior N.T. R. Sukumar Movie satellite Rights





యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇందులో ఎన్టీఆర్ ను సుకుమార్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ ఖరీదైన బైక్ ను వాడారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను లండన్ లో చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ స్టిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు బిజినెస్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమిని టీవి ఛానెల్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.