Gemini has Taken Junior N.T. R. Sukumar Movie satellite Rights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం
తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్
చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై భారీ అంచనాలే
నెలకొన్నాయి. పైగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో
రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇందులో ఎన్టీఆర్ ను సుకుమార్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడు. ఎన్టీఆర్
ఈ సినిమాలో ఓ ఖరీదైన బైక్ ను వాడారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన
కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను లండన్ లో
చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ స్టిల్ కు మంచి రెస్పాన్స్
వస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు బిజినెస్ ప్రారంభం
అయ్యింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమిని టీవి ఛానెల్ భారీ
మొత్తానికి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.
రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో
కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్
పరిశీలిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా
రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర
యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment