Showing posts with label Hyderaban bandh. Show all posts
Showing posts with label Hyderaban bandh. Show all posts

Wednesday, 2 September 2015

సమ్మె సంపూర్ణం

 

 

కార్మిక చట్టాల్లో మార్పులు, రైల్వే, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పది జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునందుకుని పదిహేను కోట్ల మంది, , మన రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా కార్మికులు సమ్మెలో పాల్గొని చరిత్ర సృష్టించారు. పలు రాష్ర్టాల్లో పారిశ్రామిక ఉత్పత్తి, రోడ్డు రవాణా స్తంభించిపోయాయి. ఒక్కటి మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ, సహకార బ్యాంకులు మూతపడ్డాయి. బొగ్గు, ఉక్కు ఉత్పత్తి ఆగిపోయింది. బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని సింగరేణి, ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు చెందిన కార్మికుల్లో 80 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో బస్సులు డిపోలను వదిలిరాలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడంతో రూ.25 వేలకోట్ల నష్టం వాటిల్లిందని బిజినెస్ చాంబర్స్ పేర్కొంది.బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా హర్తాళ్‌ పాటించారు. ఢిల్లీ, బెంగాల్‌, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, ఒడిషా, కర్ణాటక, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలన్నిటా సమ్మెను దిగ్విజయం గావించిన కార్మిక వర్గానికి సిఐటియు ఇతర కార్మిక సంఘాలు జేజేలు పలికాయి. చారిత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికుల్ని వామపక్షాలు అభినందించాయి. దేశవ్యాపితంగా జరిగిన ఈ చారిత్రిక సమ్మె చూశాక అయినా మోడీ ప్రభుత్వం కళ్తు తెరవాలి. కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలి. అని వామపక్ష నేతలు పెర్కోన్నారు.