Hero Varun Tej Kanche Movie Audio Release Date Fix
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్
కాంబినేషన్‌లో ‘కంచె’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. తన
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథకు ముడిపెట్టి
తెరకెక్కించారు. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ టీజర్‌కు విపరీతమైన
రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఇలాంటి తరహా సినిమా రాకపోవడంతో పాటు,
విజువల్స్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్!
ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని సినిమా యూనిట్ మొదట్నుంచీ
చెబుతూ వస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్‌తో అలరించిన కంచె
టీమ్, పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజు ట్రైలర్‌తో మన ముందుకు రానుంది. ఇక
సెప్టెంబర్ 12న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను జరిపేందుకు సినిమా యూనిట్
ప్లాన్ చేస్తోంది. చిరందన్ భట్ అందించిన ఆడియోతో పాటు సినిమాకు సంబంధించిన
పలు ఇంటరెస్టింగ్ అప్‌డేట్స్‌తో ఆడియో రిలీజ్‌ను పెద్ద ఎత్తున జరిపేందుకు
టీమ్ సన్నాహాలు చేస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ
సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు.