Showing posts with label New Governor. Show all posts
Showing posts with label New Governor. Show all posts

Monday, 7 September 2015

New Governor

 

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కేంద్రం తప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడ అందుకు అవునన్నట్లుగానే ఉన్నాయి. గత నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ హాజరు కాలేదు. దీంతో మనసు నొచ్చుకున్న నరసింహన్ తనను ఈ బాధ్యతలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్ ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఇది జరగాలంటే న్యాయపరమైన అంశాలపై పట్టు ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని కేంద్రం యోచిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న జస్టిస్ సదాశివం అయితే సరిగ్గా సరిపోతారని కూడా కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో నరసింహన్ స్థానంలో జస్టిస్ సదాశివంను నియమించే దిశగా కేంద్రం ఆలోచన పరుగులు తీస్తుంది.