చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత కల్పించే అగరుబత్తీల పొగ ఊపిరిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను చేరుస్తోందట.
అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం జరిపారు.
అగరుబత్తీల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు ఉన్నట్లు తేలిందన్నారు.
వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని వీరు వివరించారు.
అగరబత్తీల నుంచి పొగతో పాటు గాలిలో కలిసిన రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరి
వాపునకు దారితీస్తాయని వివరించారు. దీంతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్,
చైల్డ్ హుడ్ లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్ కు కారణమవుతోందని తెలిపారు.