Showing posts with label allu arjun warned to ram charan tej. Show all posts
Showing posts with label allu arjun warned to ram charan tej. Show all posts

Monday, 7 September 2015

Allu Arjun Gave Serious Warning To Ram Charan Tej

 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ గా నటిస్తున్నాడు రాంచరణ్. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా ఈ చిత్రం విషయంలో రాంచరణ్ కి అల్లు అర్జున్ సీరియస్ గా ఓ వార్నింగ్ ఇచ్చాడట. ఆ సీరియస్ వార్నింగ్ ఏంటో తెలుసా…
ఈ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటిస్తున్నాడు కాబట్టి రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయాల్సి వచ్చిందట. ఈ రిస్కీ ఫైట్స్ ని డూప్ లేకుండా చేసాడట రామ్ చరణ్. అంత రిస్క్ వద్దని మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తో సహా కుటుంబ సభ్యులందరూ చెప్పారట. అయినా సరే రామ్ చరణ్ వినలేదట. దాంతో అల్లు అర్జున్ వాదనికి దిగి రాంచరణ్ తో గొడవపడ్డాడని సమాచారమ్. అభిమానులు ఈ రిస్కీ ఫైట్స్ చూసి ఆనందపడతారు. అంత మాత్రానా లైఫ్ ని రిస్క్ చేసే పనులు చేయకూడదని సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చాడట అల్లు అర్జున్. ఇకముందు ఇలాంటి రిస్క్ లు చేయడానికి సాహసించవద్దని కూడా అల్లు అర్జున్ హెచ్చరించాడట. మరి సీరియస్ గా బన్నీ ఇచ్చిన వార్నింగ్ ని చరణ్ సీరియస్ గా తీసుకుంటాడా…