భారత్‌లో 125 రూపాయల నాణాలు చలామణిలోకి రానున్నాయి. భారత రాజ్యాంగ
సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి
ఉత్సవాల సందర్భంగా, రూ. 125 నాణాలను తయారు చేసి విడుదల చేయాలని కేంద్రం
భావిస్తోంది. ఏప్రిల్ 14, 1891న అంబేద్కర్ జన్మించారు. ఆయన 125వ జయంతి
వేడుకలను 2016లో ఘనంగా జరపాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది
పొడవునా ఆయనను గుర్తు చేసుకునే కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ
నిర్ణయించింది. అంబేద్కర్‌కు ఘన నివాళి అందించేందుకు భారత చరిత్రలో ఎన్నడూ
లేని విధంగా రూ. 125 నాణాలను తయారు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ
అధికారులు తెలిపారు. ఈ నాణెం ఎలా ఉండాలన్న విషయమై సాంఘిక సంక్షేమ శాఖతో
చర్చిస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ, రూపాయి చిహ్నం, మూడు సింహాల ముద్ర
ఉంటాయని సమాచారం. దీంతో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంపునూ విడుదల చేయాలని
కేంద్రం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.