Showing posts with label
extra musci director for Akhil movie.
Show all posts
Showing posts with label
extra musci director for Akhil movie.
Show all posts

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్
అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్
దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్
నితిన్ నిర్మిస్తున్న ‘అఖిల్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పాట చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది. ఈ
సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడనికి
సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే…
ఈ చిత్రానికి తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే అవకాశం డైరెక్టర్ వినాయక్
ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ ఇద్దరూ అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత
ఎఫిక్టివ్ గా చేయలేరని భావిస్తున్నాడట వి.వి.వినాయక్. ఈ నేపధ్యంలో సంగీత
దర్శకుడు మణిశర్మను రంగంలోకి దింపాడు వినాయక్. తను అయితే ఎఫ్టికివ్ గా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయగలడని, సినిమాకి ప్రాణం పోసే బ్యాక్ గ్రౌండ్
స్కోర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే వినాయక్ ఈ రకంగా డిసైడ్
అయ్యాడని సమాచారమ్. ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రానికి అనూప్ రూబెన్స్
పాటలిస్తే, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. ఇప్పుడీ చిత్రానికి కూడా
తమన్, అనూప్ సంగీత దర్శకులైనప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ
రంగంలోకి దిగడం విశేషం ‘టెంపర్’ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా
ప్లస్ అయ్యింది. అఖిల్ చిత్రానికి కూడా మణిశర్మ రీ-రికార్డింగ్ హైలెట్ గా
నిలుస్తుందని ఊహించవచ్చు.అఖిల్ కోసం