అతి ఖరీదైన మోటార్ బైక్ ను ట్రయల్ రన్ పేరుతో తీసుకుని వెళ్లి ఉడాయించిన
వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. సయ్యద్ తాహేర్ గా పరిచయం చేసుకుని
బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీ వద్ద ఉన్న షోరూంలో ఈ మోటార్ సైకిల్ ను
తీసుకున్నాడు. తాను కొనుగోలు చేస్తానని నమ్మబలికాడు.క్రెడిట్ కార్డులు కూడా
చూపించాడు.దాంతో నమ్మి అతను అడిగిన వెంటనే మోటార్ బైక్ ను ట్రయల్ కోసం
ఇచ్చారు. దానిని తీసుకున్న అతడు ఆ తర్వాత ఎంతసేపటికి తిరిగి రాలేదు.అప్పుడు
అతను దొంగ అని అర్దం చేసుకుని లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు నాలుగు బృంధాలుగా ఏర్పడి గాలించగా,అతను ముంబైలో దొరికాడు. అతడు
అక్కడ సబ్ మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని వెల్లడైంది. అంత మంచి
ఉద్యోగం చేస్తున్న ఇతడికి ఇదేమి పాడుబుద్దో! ఆరు లక్షల రూపాయల విలువైన బైక్
ను అతను కాజేయడానికి యత్నించాడు.