Showing posts with label i phone 6 plus. Show all posts
Showing posts with label i phone 6 plus. Show all posts

Thursday, 10 September 2015

మార్కెట్ లోకి యాపిల్ కొత్త ఐఫోన్

 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మరిన్ని ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న వాటికి అప్డేటెడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. కొత్తగా ఐఫోన్కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ఫస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇవి లభించనున్నాయి. వీటితోపాటు ఐప్యాడ్ ప్రో, ఏ9ఎక్స్ ప్రాసెసర్.. వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు కంపెనీ సీఈవో టీమ్ కుక్ 12.9 అంగుళాల స్క్రీన్తో రూపొందించిన ఐప్యాడ్ ప్రో కోసం కొత్తగా పెన్సిల్ పేరిట స్టైలస్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. అమెరికాలో ఐప్యాడ్ ప్రో ధర 799 నుంచి 1,079 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టైలస్ ధర 99 డాలర్లు, స్మార్టు కీచోర్డు 169 డాలర్లుగాను ఉండనుంది. 7.9 అంగుళాల ఐప్యాడ్ మినీ 4నూ యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర 399 డాలర్లు అని కంపెనీ ప్రకటించింది. ఇన్బిల్ట్ మైక్ గల టచ్ స్క్రీన్ రిమోట్ లో సరికొత్త యాపిల్ టీవీని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రవేశపెట్టారు.