Showing posts with label i was not plying in his bowling. Show all posts
Showing posts with label i was not plying in his bowling. Show all posts

Wednesday, 26 August 2015

అతని బౌలింగ్ లో ఆడలేకపోయా : సంగక్కర



Sriలంక క్రికెటర్ కమార సంగక్కర భారత్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. టెస్టులాడే అన్ని దేశాలతో క్రికెట్ ఆడిన సంగక్కర,క్రీజులో కుదురుకున్నడాంటే ఇక పరుగుల వర్షం కురుస్తాడు. అతన్ని అవుట్ చేయాలంటే క్లిష్టమైన బంతులేయాలి. సంగక్కర అయితే క్రికెట్ సుదీర్ఘ కెరీర్ లో తనను ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి చెప్పాడు. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అత్యంత క్లిష్టమైన బౌలర్ అని సంగక్కర చెప్పాడు. జహార్ బంతులను ఎదుర్కోవడం సవాలని, తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జహీర్ ఖాన్ అని తెలిపాడు. మరో బౌలర్ గ్రేమ్ స్వాన్ తో పాటు, వసీం అక్రమ్ ను ఎదుర్కొన్నానని, ఆయన బౌలింగ్ శైలి అద్భుతమని సంగ అన్నాడు. చివర్లో అశ్విన్ బౌలింగ్ ఎదుర్కోవడం కూడా కష్టంగా తోచిందని సంగక్కర చెప్పాడు. 15 ఏళ్ల కెరీర్ లో 134 టెస్టులాడిన సంగక్కర 57 సగటుతో 12,400 పరుగులు చేశాడు.