
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లరికల్ రిటన్
ఎగ్జామినేషన్- 2015కు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అర్హత సాధించిన వారిని
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐ తప్ప) క్లర్క్/ ఆఫీస్ అసిస్టెంట్ హోదాలో
నియమిస్తారు.
పోస్టుల వివరాలు……..
క్లర్క్స్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్- 2015
బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్
ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్
బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్
బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంక్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపికచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం: రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ
ఎగ్జామినేషన్‌లో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యుమరికల్
ఎబిలిటీ, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100.
దీనిలో అర్హత సాధించినవారిని మెయిన్‌కు ఎంపికచేస్తారు. మెయిన్‌లో అయిదు
విభాగాలు ఉంటాయి. ఇందులో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ఒక్కో విభాగానికి 40
ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 200.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 11
చివరితేది: సెప్టెంబరు 1
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేది: డిసెంబరు 5, 6, 12, 13.
మెయిన్ ఎగ్జామినేషన్ తేది: జనవరి 2, 3