పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ తో ఎటువంటి యుద్ధానికైనా ,
మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే ఆ
దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని ఆసిఫ్ ఈ సందర్బంగా అన్నారు.
రేడియో పాకిస్థాన్ కార్యక్రమంలో ఆసిఫ్ పాల్గొన్నారు. శాంతి స్థాపనపై తమకు
నమ్మకం ఉందని, అయితే దురుసుగా వ్యవహరిస్తే ఏవిధంగా సమాధానం చెప్పాలో కూడా
తమకు తెలుసని ఆసిఫ్ హెచ్చరించారు. అయితే, భవిష్యత్ లో చిన్నాచితక యుద్ధాలు
రావచ్చని సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల భారత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్
సింగ్ చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. ఈ ప్రకటన చేయడంతో పాక్ మంత్రి ఈ
వ్యాఖ్యలు చేశారు.