Showing posts with label jobs in infosys. Show all posts
Showing posts with label jobs in infosys. Show all posts

Monday, 31 August 2015

27 thousand vacancies in Infosys company



రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఉద్యోగాలు పంట పండించనుంది. బెంగుళూరులో మూడు క్యాంపస్‌లు ఏర్పాటు చెయ్యటం ద్వారా 27 వేల ఉద్యోగాలను సృష్టించనుంది. దీని కోసం 1,918 కోట్ల రూపాయలను వ్యయం చేయాలని నిర్ణయించింది. వీటిలో ఒక క్యాంపస్‌ను ఎలక్ట్రానిక్‌ సిటీలో, మరో రెండింటిని దక్షిణ బెంగళూరులోని కొన్నప్ప ఆగ్రహారలో నిర్మించనుంది. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అధ్యక్షతన జరిగిన స్టేట్‌ లెవల్‌ క్లియరెన్స్‌ కమిటీ దీనికి అనుమతి ఇచ్చింది. మూడు క్యాంపస్‌ల నిర్మాణం ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయని సిఎం చెప్పారు. కొన్నప్ప ఆగ్రహారలోని క్యాంపస్‌కు ఇన్ఫోసిస్‌ 625 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుందన్నారు. దీని ద్వార 8వేల500 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అదే ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ని 1,079 కోట్ల రూపాయలతో నెలకొల్పటానికి ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు. దీని ద్వార 15వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారన్నారు. ఎలక్ట్రానిక్‌ సిటీలోని ప్రాజెక్ట్‌లో 3,500 ఉద్యోగాలు వస్తాయని సిద్ధారామయ్య చెప్పారు.

To visit website Please Click Here