తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరికాసేపట్లో చైనా టూరుకు
బయలుదేరనున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
విదేశీ బాటపడుతున్నారు.మంత్రులు, అధికారులతో కలిసి ఆయన నేటి ఉదయం 10 గంటలకు
శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చైనా
బయలుదేరనున్నారు. ఈ పర్యటన ఈ నెల 16 వతేదీ వరకు కొనసాగనుంది. విదేశాలనుంచి
రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా సీఎం ఈ పర్యటనకు
రూపకల్పన చేశారు. చైనాలో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ సీఎం
పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో
మొత్తం 19 మంది చైనా పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనను ఉపయోగించుకుని
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటి
చెప్పాలని భావిస్తున్నారు.