మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ అరడజను పైగా హీరోలు వెండితెరపై ఎంట్రీ
ఇచ్చారు. కాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక అక్కినేని అఖిల్ తో
షార్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసి… ఆపై ఢీ జూనియర్స్ షోలో యాంకర్ గా
బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆపై గప్ చుప్ వంటి షోని సెలబ్రెటీలతో సందడి
చేసింది. కాగా ఇప్పుడు మెగా తనయ వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ
ఇవ్వనున్నదట. ప్రస్తుతం నిహారిక స్క్రిప్ట్ వింటుందట. తనకు నచ్చిన కథలో
హీరోయిన్ గా నటించేందుకు నీహారిక రంగం సిద్దం చేసుకొంటుందట. నాగబాబు
స్క్రిప్ట్ ఒకే చేస్తే… మెగా వారసురాలు బుల్లితెరపై నుంచి వెండితెరపై అడుగు
పెట్టనున్నదట.