Showing posts with label nirbaya case extended for 10 years. Show all posts
Showing posts with label nirbaya case extended for 10 years. Show all posts

Wednesday, 2 September 2015

నిర్బయ దోషులకు మరో పదేళ్ల శిక్ష

 

2012 డిసెంబర్ 16న దేశ రాజధాని నడిబొడ్డున అత్యంత దారుణానికి తెగబడ్డ నిర్భయ దోషులకు మరో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఒక దోపిడి కేసులో విధించిన శిక్ష. నిర్భయ ఘటనకు ముందు ఆ దారుణానికి పాల్పడ్డ దోషులు ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్, రాం సింగ్ లు ఓ కార్పెంటర్ పై దాడికి దిగి అతడిని నిలువుదోపిడీ చేశారు. దీనిని ఢిల్లీ పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఢిల్లీ అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి రితేష్ సింగ్ నిందితులు నలుగురికి ఒక్కక్కరికి విడివిడిగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. కాగా, నిర్భయ కేసులో ఇప్పటికే వీరికి సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దోషుల్లో ఒకడైన రామ్ సింగ్ 2013, మార్చి 13న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించారు. అదింకా పెండింగ్ లో ఉంది.