ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్తే నీళ్లు
కొట్టిస్తున్నారు.ఈ పెట్రోల్ బంక్ కర్నూలు జిల్లా నంద్యాలలో వుంది. ఈ బంక్
లో డీజిల్, పెట్రోల్ కొట్టించుకున్న సదరు వాహనదారులు కొద్ది దూరం వెళ్లాక
తమ వాహానాలు మోరయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లారు. ఇక మరమ్మతులకు రూ.
20 వేల వరకు ఖర్చు అవుతుందని తెల్పడంతో వారికి దిమ్మతిరిగింది. ఇంతకీ ఏమి
జరిగిందింటే ఆ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు వాటర్ పోస్తున్నారని ఆ
మెకానిక్ బాధితులకు తెలిపాడు. ఇలాంటి ఘటనను ఎదుర్కున్న బాధితులందరూ ఆ
పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే వర్షం వల్ల డీజిల్ ట్యాంక్ లో
నీళ్లు కలిశాయని బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.