ప్రముఖ సినీ నటుడు మానవతా ధృక్పథంతో ‘శ్రీమంతుడు’ సినిమా తరహాలో ఓ
గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమంతో స్ఫూర్తి పొందిన
ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు
ముందుకొచ్చారు. ఈ ఇవాళ ఆయన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావును
కలిశారు. ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని
కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా గ్రామాన్ని దత్తత
తీసుకునేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు
తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన శ్రీమంతుడు
సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఆ సినిమా స్టార్ మహేశ్‌బాబు తెలంగాణలో ఓ
గ్రామాన్ని, ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి
తెలిసిందే. మరో వైపు శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా తమిళనాడులోని ఓ
గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.