సెల్ఫీలతో నేటి యువతకు ఆనందానికి హద్దులు లేకుండపోతుంది. ఇటీవల ఈ సెల్ఫీలకు ఆధారణ ఎక్కువగా పెరిగింది.
ఎక్కడ పడితే అక్కడ ఒకరిద్దరు, గుంపుగా చేరి మొబైల్ ఫోన్లతో సెల్ఫీ ఫోటోలు
దిగుతున్నారు. సెల్ఫీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలూ అనేకం
జరుగుతున్న యువత మాత్రం వాటికి దూరంగా ఉండకుండా ఉండలేకపోతుంది. సామాజిక
మాధ్యమాలలో తమ ఫోటోలను అప్ చేయడం, తద్వారా వచ్చే లైక్స్ వంటివే యువతను
సెల్ఫీల ఊబిలోకి నెడుతున్నట్టు తాజా సమాచారం తెలుస్తోంది. అత్యధికంగా
సెల్ఫీ తీసుకోవడం కూడా మానసిక సమస్యలు ఏర్పడుతాయాని అమెరికా వైద్యులు
వెల్లడించారు. ఈ విషయం పక్కనపెడితే సెల్ఫీలు తీసుకోవడం వలన తలలో పేలు ఒకరి
నుంచి ఒకరికి పాకే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. సెల్ఫీలు
తీసుకునే సమయంలో యువత ఒకరిపై ఒకరు వాలి, తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి
పోజులిస్తున్నారు. ఆ సమయంలో ఒకరి తల నుంచి మరొకరికి పేలు పాకుతున్నాయి.
కనుక సెల్ఫీలు తీసుకునే వారు ఒకరి తల మరొకరికి తగలని విధంగా పోజు ఇవ్వాలని
వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధంగా సెల్ఫీలు తీసుకునే అమ్మాయిలకు తలలో
ఎక్కువగా పేలు పెరగడం, చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు
హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఎతైన ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకుంటున్న
సమయంలో కాలుజారి మరణించిన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి సెల్ఫీలు
తీసుకుంటున్న సమయంలో జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి వాటిని నివారించవచ్చని
వైద్యులు సూచిస్తున్నారు.