Showing posts with label simbhu with nayana tara. Show all posts
Showing posts with label simbhu with nayana tara. Show all posts

Thursday, 3 September 2015

నయన తారపై శింబు కేసు

 

నయన తార హీరోయిన్ గా ఎంత పేరు సంపాదించుకొందో.. విఫల ప్రేమికురాలిగా అంతే పేరు తెచ్చుకొంది. ఒకానొక సమయంలో నయనతార శింబు లు ప్రేమ సామ్రాజ్యంలో మునిగితేలారు. అభిప్రాయ బేధాలతో విడిపోయారు. ఎవరికి వారు కెరీర్ లో బిజీ అయిపోయారు. తాజాగా ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. శింబు మూడేళ్ల తర్వాత వాలు సినిమాతో హిట్ సొంతం చేసుకొన్నాడు. దీంతో శింబు కష్టాలు తీరిపోయాయి అని అనుకొన్నంత సేపు పట్టలేదు. శింబును కష్టాలు చుట్టిముట్టడానికి.

నయన తార, శింబు కాంబినేషన్ లో ఇదునమ్మఆలు సినిమా పాండిరాజ్ రూపొందిస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఆర్ధిక కష్టాలతో ఆగిపోయి మళ్ళీ మొదలైంది. దీంతో శింబు నయన్ ని షూటింగ్ కు రమ్మనమని కోరాడట. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు మీదనున్న నయన్ కు షూటింగ్ కు వెళ్ళడం కుదరలేదట. దీంతో శింబు నయన్ తారపై కేసు పెట్టాడు. ఈ నేపద్యంలో నయన తార నేను ఆ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ వాడుకోలేదు… అంతే కాదు ఆ సినిమా పారితోషకం నాకు ఇంకా యాభై లక్షలు బాకీ ఉంది అని తెలిపింది. అంతేకాదు నాకు యాభై లక్షలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు చేస్తున్న ఇతర సినిమాలు వదిలేసి ఎలా శింబు సినిమా చెయ్యగలను అని చెబుతున్నది.