Showing posts with label sunny leon gossip news. Show all posts
Showing posts with label sunny leon gossip news. Show all posts

Monday, 7 September 2015

సన్నీ దేశం విడిచిపో

 

బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ ఇటీవల నటించిన కండోమ్ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సన్నీ లియోన్ దేశం విడిచి వెళ్లిపో.. నా దేశసభ్యత, సంస్కారాలను మంటకలపకు’ అనే పోస్టర్ తో సన్నీకి వ్యతిరేకంగా పలువురు ఢిల్లీలోని ప్రముఖ ధర్నా ఘాట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. కండోమ్ వాణిజ్య ప్రకటనలో సన్నీ లియోన్ నటించడంపై సిపిఐ నేత అతుల్ కుమార్ అంజన్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సన్నీ చేసిన ఆ వాణిజ్య ప్రకటనతో అత్యాచారాలు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సన్నీ లియోన్ ఘాటుగానే స్పందించారు. రాజకీయ నేతలు అనవసర విషయాలతో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. ‘నాపై దృష్టి పెట్టకుండా ప్రజా సేవకు తమ కాలాన్ని వినియోగించాలి’ అని అంజన్ ను ఉద్దేశించి సన్నీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా జంతర్ మంతర్ వద్ద ధర్నా ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.