Showing posts with label telangana govt jobs. Show all posts
Showing posts with label telangana govt jobs. Show all posts

Tuesday, 25 August 2015

Governament Of Telangana Has Trying to Release of Notification in one week

Governament Of Telangana Has Trying to  Release of Notification in one week

వారంలోగా మరో నోటిఫికేషన్..

 

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగంగా ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (సివిల్) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, త్వరలోనే మరిన్ని ప్రకటనలు విడుదల చేయనున్నట్టు సమాచారం. వారంలోగా మెకానికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్ ఉన్నతస్థాయి వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్

మొదటి నోటిఫికేషన్‌ను పకడ్బందీగా విడుదల చేసినట్లే, త్వరలో భర్తీచేసే పోస్టుల్లో కూడా ఎలాంటి న్యాయ, సర్వీస్ పరమైన సమస్యలు తలెత్తకుండా కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిసహా సభ్యులు సీ విఠల్, చంద్రావతి, మతీనొద్దీన్ ఖాద్రీలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో విడుదల చేయనున్న వ్యవసాయ, ఉద్యానవన, అబ్కారీ శాఖల ఖాళీలకు సంబంధించిన ప్రక్రియపై కూడా కమిషన్‌లో సన్నాహాలు సాగుతున్నాయని సమాచారం.