Showing posts with label
tollywood actresses anjali gossip.
Show all posts
Showing posts with label
tollywood actresses anjali gossip.
Show all posts
రెండేళ్లుగా వివాదాలతో వార్తల్లోకెక్కింది తెలుగమ్మాయి అంజలి. అంజలి
చెల్లెలు ఆరాధ్య హీరోయిన్‌గా అరంగేట్రం చేయబోతోందంటూ టాలీవుడ్‌లో కథనాలు
వచ్చాయి. అయితే ఈ వార్తలను అంజలి ఖండించింది. తనకసలు చెల్లెళ్లే లేరని
స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’లో నటిస్తున్న అంజలి
షూటింగ్ నిమిత్తం బల్గేరియాలో ఉంది. సామాజిక మాధ్యమం ద్వారా చెల్లెలి
అరంగేట్రం వార్త గురించి తెలుసుకున్న అంజలి తన మేనేజర్ ద్వారా పత్రికా
ప్రకటన విడుదల చేసింది. అందులో ‘నాకు చెల్లెళ్లు లేరు. ఉన్నదల్లా అక్క
మాత్రమే. ఆమెకు కూడా పెళ్లయ్యి, త్వరలో బిడ్డ కూడా పుట్టబోతున్నాడు. దయచేసి
ఈ వార్తలను నమ్మద్దు’ అని పేర్కొంది.