Showing posts with label
usain bolt athletics winnner of jamica.
Show all posts
Showing posts with label
usain bolt athletics winnner of jamica.
Show all posts
బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో జమైకా పరుగుల
వీరుడు ఉసేన్ బోల్ట్ జోరు కొనసాగుతోంది. మొన్న 100 మీ పరుగులో సత్తా చాటిన
బోల్ట్, తాజాగా, 200 మీ పరుగుపందెం ఫైనల్లో విజేతగా నిలిచాడు. 19.55
సెకన్లతో రేసు పూర్తి చేసిన ఈ జమైకా చిరుత మరోసారి జస్టిన్ గాట్లిన్ ను
రెండోస్థానానికి పరిమితం చేశాడు. గాట్లిన్ 19.74 సెకన్లతో ద్వితీయ స్థానంతో
సరిపెట్టుకున్నాడు. 100 మీ స్ప్రింట్ ఫైనల్లోనూ గాట్లిన్… బోల్ట్ ధాటికి
నిరాశకు గురికాక తప్పలేదు.