
30 యేళ్ళు దాటిన తరువాత మగవారు కొన్ని పనులు చెయ్యకూడదు. 30 సంవత్సరాల
తరువాత మగవారి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా మెటాబాలిజం
తగ్గడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరగడం కూడా తగ్గుముఖం పడుతుంది.అందువల్లే,
30 సంవత్సరాలు దాటిన తరువాత క్యాలరీలు ఎక్కువగా తీసుకోకపోయినా పొట్ట
చుట్టూ కొవ్వు చేరుతుంది. ఇదే ఆహారం ఒకప్పుడు మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచినా
30 సంవత్సరాల వయసు తరువాత అదే కొవ్వు గా మారడం మొదలవుతుంది. అందువల్ల 30
దాటగానే శారీరక శ్రమని కాస్త పెంచి క్యాలరీలు తీసుకోవడం కొంచమైనా తగ్గిస్తే
మంచిది.
1. లైంగిక ఆరోగ్యాన్నికాపాడుకోవడం
30 యెళ్ళు దాటగానే మీలో టెస్టోస్టీరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అందువల్ల
మీ శ్రుంగారేచ్చని కాపాడుకోవడానికి చెయ్యాల్సినదంతా చెయ్యలి.ఒకవేళ మీకు
ధూమపానం అలవాటుంటే తక్షణమే మానుకోవడం మంచిది. ఎందుకంటే ధూమపానం మీ శ్రుంగార
జీవితాన్ని నిస్సారం చేసెస్తుంది.
2. రోడ్డుపక్కన అమ్మే తినుబండారాలు తినడం
మీరు వయసులో ఉన్నప్పుడూ మీ శరీరం దేనినైనా జీర్ణం చేసుకోగలదు. కానీ మీకు 30
యేళ్ళు తర్వాత మీరు ఇలాంటి పదార్ధాలని ఎంత నివారిస్తే అంత మంచిది. మీ
రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతు సంబంధిత ఇంఫెక్షన్లు,గ్యాస్ట్రిక్ లాంటి
జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ.
3. అమిత మద్యపానం
మద్యాన్ని మితంగా తీసుకుంటే వచ్చే ముప్పేమీ లేదు. ఒకవేళ మీరు విందులు
వినోదాల పేరుతో మద్యాన్ని అమితంగా తాగేవారయితే 30 యేళ్ళు దాటినా ఇంకా అలా
తాగుతున్నారంటే అది మీ మానసిక స్థితికి నిదర్శనం. ఒక్కోసారి ఈ అలవాటు
వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
4. వీడియో గేమ్స్
వీడియో గేంస్ వ్యసనం మీ మేధాశక్తిని కుంటుపడేటట్లు చేస్తుంది. చిన్న
పిల్లలు ఇవి మితంగా ఆడుకోవచ్చు కానీ 30 యేళ్ళు దాటిన మీరు వ్యసనంతో అలా
గంటలు గంటలు కూర్చోవడం వల్ల మీ కళ్ళ ఆరోగ్యం మరియు మీ కీళ్ళ ఆరోగ్యాన్ని
పణం గా పెట్టవలసి వస్తుంది.
5. జంక్ ఫుడ్
30 యెళ్ళ తరువాత కూడా మీకు మీ ఆరోగ్యం పట్ల స్ప్రుహ లేకపోతే ఒబేసిటీ లేదా హ్రుదయ సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కబళించ వచ్చు.
6. అతిగా టీవీ చూడటం
గంటల తరబడి కనీసం లేవకుండా టీవీ చూడటం ఒక మానసిక రుగ్మత. 30 యేళ్ళు దాటాకా మీ ఆరోగ్యం కోసం అలాంటి రుగ్మత లకి దూరం గా ఉండటం మేలు.
7. రాత్రిళ్ళు లేటు గా పడుకోవడం:
30 యేళ్ళ తరువాతా మీ శరీరం స్థిమిత పడాలి. అందువల్ల నిర్ణీత వేళకి తిని
పడుకోవడం చాలా ముఖ్యం ఈ వయసులో నిద్ర లేమి అనేక ఆరోగ్య సంబంధిత కారణాలకి
హేతువు.
8. భోజనం మానెయ్యడం:
మీరేమీ టీనేజర్ కాదు కదా రోజంతా శక్తివంతంగా ఉండటానికి. పొరపాటున కూడా 30 యేళ్ళు దాటగానే ఒక్కపూట కూడా భోజనం మానొద్దు.
9. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ:
చాలా మంది మహిళలు 30 దాటగానే తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు.ఇది చాలా పొరపాటు. ఆడవారైనా మగవారైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.