Showing posts with label 2015 notification of TSPSc. Show all posts
Showing posts with label 2015 notification of TSPSc. Show all posts

Sunday, 30 August 2015

TSPSC Has Released Second Notification

 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
వివిధ శాఖలలో పోస్టుల వివరాలు…
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్),
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42,
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్),
మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ ),
టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్),
టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.

To get Notification Please click here