Sunday, 30 August 2015
TSPSC Has Released Second Notification
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment