Don't Drink While Driving Police can Catch and They are sending to Jail.
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రి పూట రయ్య్య్‌యమంటూ దూసుకుపోయే బైకులు.. కార్లు! లోపలి మనుషుల పట్టపగ్గాల్లేని వేగం.. ఆనందం! మత్తు.. గమ్మత్తు!! అందరిలోనూ గాల్లో తేలినట్టుండే ఓ భావన! సడన్‌గా ఓ మూలమలుపు! లేదంటే పక్కగా వెళ్లే బైకులో.. నడిచివెళ్లే పాదచారులో! ఒకే ఒక్క క్షణంలో టైర్లు కీచుమంటూ నేలను ఒరుసుకుపోయి.. భారీ శబ్దం! ఒక హాహాకారం! లేదంటే చడీచప్పుడు లేకుండా పోయే ప్రాణం! చెట్టునో.. గోడనో ఢీకొని కారులో విరిగిపోయే ఛాతీ! పగిలిపోయి నెత్తురోడే తల.. చిట్లిపోయే దేహం! మద్యం తాగి వాహనం నడిపిన సందర్భాల్లో నడిపినవారికో.. నడుచుకుంటూ పోతూ తాగినవారి బారినపడినవారికో ఎదురయ్యే దుస్థితి! దుర్మృతి ఇది!! హైదరాబాద్ నగరంలో రాత్రయితే చాలు.. ఎక్కడ ఎవరిని ఢీకొంటుందో తెలియని వేగంతో దూసుకుపోయే వాహనాలు! అనేక జీవితాలు.. అందునా ముప్ఫై ఏండ్ల నవయవ్వనాలు! అకస్మాత్తుగా రాలిపోతున్నాయి! దీన్నో సవాలుగా తీసుకున్న నగర పోలీసు అధికారులు ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు డ్రంకెన్ డ్రైవ్ సోదాలను ముమ్మరం చేశారు.