Tuesday, 25 August 2015

Don't Drink While Driving Police can Catch and They will sending to Jail.

Don't Drink While Driving Police can Catch and They are sending to Jail.





క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రి పూట రయ్య్య్‌‌యమంటూ దూసుకుపోయే బైకులు.. కార్లు! లోపలి మనుషుల పట్టపగ్గాల్లేని వేగం.. ఆనందం! మత్తు.. గమ్మత్తు!! అందరిలోనూ గాల్లో తేలినట్టుండే ఓ భావన! సడన్‌గా ఓ మూలమలుపు! లేదంటే పక్కగా వెళ్లే బైకులో.. నడిచివెళ్లే పాదచారులో! ఒకే ఒక్క క్షణంలో టైర్లు కీచుమంటూ నేలను ఒరుసుకుపోయి.. భారీ శబ్దం! ఒక హాహాకారం! లేదంటే చడీచప్పుడు లేకుండా పోయే ప్రాణం! చెట్టునో.. గోడనో ఢీకొని కారులో విరిగిపోయే ఛాతీ! పగిలిపోయి నెత్తురోడే తల.. చిట్లిపోయే దేహం! మద్యం తాగి వాహనం నడిపిన సందర్భాల్లో నడిపినవారికో.. నడుచుకుంటూ పోతూ తాగినవారి బారినపడినవారికో ఎదురయ్యే దుస్థితి! దుర్మృతి ఇది!! హైదరాబాద్ నగరంలో రాత్రయితే చాలు.. ఎక్కడ ఎవరిని ఢీకొంటుందో తెలియని వేగంతో దూసుకుపోయే వాహనాలు! అనేక జీవితాలు.. అందునా ముప్ఫై ఏండ్ల నవయవ్వనాలు! అకస్మాత్తుగా రాలిపోతున్నాయి! దీన్నో సవాలుగా తీసుకున్న నగర పోలీసు అధికారులు ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు డ్రంకెన్ డ్రైవ్ సోదాలను ముమ్మరం చేశారు.

Cases List Of Drunk And Drive

So Guys Voice Of Telangana Advise to all Please Don't Drink While Driving.Happy Living.

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తూ ఫలితాలు కూడా సాధిస్తున్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగితే రానున్న సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమేనని పేర్కొంటున్నారు.మద్యం తాగి నడిపితే వాహనదారుడికి, ఆయనపై ఆధారపడి ఉన్న కుటుంబానికి, లేదా ప్రమాదానికి గురయ్యే వ్యక్తికి జరిగే నష్టం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. ఇంకా ఇటువంటి ఉదంతాలు కొనసాగుతూనే ఉండటంతో నాలుగేండ్లుగా డ్రంకెన్ డ్రైవ్ సోదాలను జంట కమిషనరేట్ల పోలీసు సిబ్బంది కఠినతరం చేశారు. గతంలో వారాంతాల్లో నిర్వహించిన సోదాలను.. ఇప్పుడు వారం లో ఏడు రోజులూ చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడినవారిని జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టుకు పంపిస్తున్నారు. ఒకసారి పట్టుబడితే వారికి ట్రాఫిక్ నిబంధనలు, మద్యం తాగి వాహనం నడపడంవల్ల కలిగే అనర్థాల గురించి క్లాసులు పెట్టి మరీ వివరిస్తున్నారు. సెలెబ్రిటీలు, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. మద్యం తాగిన మోతాదును ఆధారాలతో సహా టెక్నాలజీ సహాయంతో కోర్టుల ముందు ఉంచుతున్నారు. 


No comments:

Post a Comment