Showing posts with label kcr toor mahabubnagar. Show all posts
Showing posts with label kcr toor mahabubnagar. Show all posts

Wednesday, 9 September 2015

పాలమూరు పర్యటనకు నేడు కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం పాలమూరు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం, నేరళ్లపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గ్రామంలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణం, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా మంచినీటి ఎద్దడి నివారణ కోసం నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ను, పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. తక్కువ విద్యుత్‌ను వినియోగించే సీఎఫ్‌ఎల్ వీధిదీపాలను వెలిగిస్తారు.