Showing posts with label
raja mouli talk about bahubali.
Show all posts
Showing posts with label
raja mouli talk about bahubali.
Show all posts
సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – 2′.
ముఖ్యంగా కట్టప్ప… బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ దొరుకుతుందని వెయిట్
చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ”బాహుబలి – ది కంక్లూజన్’ అనే టైటిల్
పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలకు అన్నిటికీ కంక్లూజన్
దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా
రాజమౌళి ఈ చిత్రం కథని తమ టీమ్ కు నేరేట్ చేయటం జరిగింది. ఆ ఫొటో ని
నిర్మాత శోభు తన ట్విట్టర్ లో ఫోస్ట్ చేసారు.
మరో ప్రక్క …..ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదట అనుకున్న తేదీన
కాకుండా నవంబర్ కు ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్
కాకపోవటమే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ
స్క్రిప్టు పైనే పనిచేస్టున్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి
కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు
మారిందని చెప్పుకుంటున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్
కలెక్షన్స్ రాబట్టి 50 రోజుల పండుగ ఈ మధ్యనే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ
నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.