Thursday, 10 September 2015

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పిన రాజమౌళి

 

సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – 2′. ముఖ్యంగా కట్టప్ప… బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ”బాహుబలి – ది కంక్లూజన్‌’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలకు అన్నిటికీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా రాజమౌళి ఈ చిత్రం కథని తమ టీమ్ కు నేరేట్ చేయటం జరిగింది. ఆ ఫొటో ని నిర్మాత శోభు తన ట్విట్టర్ లో ఫోస్ట్ చేసారు.

మరో ప్రక్క …..ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదట అనుకున్న తేదీన కాకుండా నవంబర్ కు ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాకపోవటమే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు పైనే పనిచేస్టున్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు మారిందని చెప్పుకుంటున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టి 50 రోజుల పండుగ ఈ మధ్యనే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

No comments:

Post a Comment