తొలి టెస్టులో అనూహ్యంగా గెలిచి, రెండో టెస్టులో చిత్తుగా ఓడి, ఆపై
సంగక్కర నిష్క్రమణతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన స్థితిలో శ్రీలంక. అద్భుతంగా
పుంజుకుని, ఘనవిజయం సాధించిన నూతనోత్సాహంలో టీమ్ ఇండియా. ఈ నేపథ్యంలో
ఆఖరిపోరాటానికి రంగం సిద్ధమైపోయింది. శుక్రవారం నుంచే మూడో టెస్టు. మరి
ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ అదే జోరుతో సిరీస్ను సొంతం చేసుకుంటుందా..
సొంతగడ్డపై లంకేయులు ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ముందంజ వేస్తారా అన్నది
వేచిచూడాలి.