సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ
చిత్రం ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది.
శ్రీమంతుడు ట్రైలర్-లోని రాజేంద్రప్రసాద్, శృతిహాసన్, ఊరి జనం నడుచుకుంటూ
వచ్చే సన్నివేశం సినిమాలో లేదు. ఈ సీన్-ను ఈ నెల 28 నుంచి సినిమాలో జత
చేస్తున్నారు. ఈ విషయం ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో
దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్, మోహన్ తెలిపారు.