Sunday, 30 August 2015

6 లక్షల మైలురాయిని దాటిన టాటా



దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటాగ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మైలురాయిని దాటింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నీ తయారు చేసే టాటా గ్రూపు సంస్థల్లో మార్చి 2015 చివరినాటికల్లా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 6,11,794గా నమోదైంది. అందులో ఐటీ, కమ్యూనికేషన్ విభాగ వ్యాపారాల్లో పనిచేస్తువారి సంఖ్య 3.5 లక్షలకు పైమాటే. ఇంజినీరింగ్ విభాగ సంస్థల్లో 93వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వందకు పైగా సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టాటాగ్రూపు ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10, 878 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10,327 కోట్ల డాలర్లుగా నమోదైన రెవెన్యూతో పోలిస్తే 5.3 శాతం వృద్ధి చెందింది. టాటా గ్రూపు ఆదాయంలో అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా వచ్చే వాటానే 70 శాతం మేర ఉంటుంది. గతసారి ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూ 5.8 శాతం పెరిగి 7,341 కోట్ల డాలర్లకు చేరుకుంది.

Jobs For Software Engineers

 

 Sathguru Management Consultants – Hyderabad, Andhra Pradesh
Location: Hyderabad

Experience : 2-6 Years

Employment Type : Full Time

Job Profile: Product: Development, Design & Implementation

Job Description:
This Position is suited for highly motivated and energetic individual who is expected to work with very little guidance. The incumbent would be responsible for the design, development and implementation of complete software components. The incumbent must demonstrate leadership skills on product & technology, execution and people fronts. She/he should have urge to harness new technologies and should be passionate about their jobs and be a good team player.

The incumbent would be involved in:
Product Development
Product Design & Implementation
She/he would be working on:
JAVA/J2EE, JDBC, JSP/Servlets, Struts, Springs, TOMCAT, Net Beans IDE, Java Script & AJAX, Oracle/Sql, Desktop App’s using JAVA Frames,J2ME, desktop applications.

Candidates Profile:
Should have 2-6 yrs. of strong work exp on JAVA/J2EE, JDBC, and JSP/Servlets.
Struts, springs, Hibernate, TOMCAT, Net Beans IDE, Java Script, IQuery & AJAX, and Oracle/Sql.
Should be able to work on Desktop Applications using JAVA Frames, CLDC Applications.
Exposure to Financial and Banking Domain will be an added advantage.
Ability to work according to the predefined deadlines as per the project.
Excellent communication skills both verbal & written.
Send Your Resume to: careers@sathguru.com

To visit website please click Here

TSPSC Has Released Second Notification

 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
వివిధ శాఖలలో పోస్టుల వివరాలు…
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్),
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42,
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్),
మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ ),
టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్),
టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.

To get Notification Please click here

Jobs In miot International


http://www.miotinternational.com/

To visit website please click on the above image.

చెన్నైలోని మియోట్ ఇంట‌ర్నేష‌న‌ల్స్ తిరుపతి ఇన్‌ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌లో ప‌నిచేయ‌డానికి డాక్టర్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
* డాక్టర్
అర్హత‌: ఎంబీబీఎస్‌. ఇంగ్లిష్‌, తెలుగు చ‌ద‌వ‌డం, రాయడం, మాట్లాడ‌టం తెలిసి ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా.
చిరునామా: Chairman, Miot Hospitals
4/112, Mount Poonamallee Road,
Manapakkam, Chennai-600089.
chairman@miothospitals.com

Friday, 28 August 2015

30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని పనులు

 

30 యేళ్ళు దాటిన తరువాత మగవారు కొన్ని పనులు చెయ్యకూడదు. 30 సంవత్సరాల తరువాత మగవారి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా మెటాబాలిజం తగ్గడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరగడం కూడా తగ్గుముఖం పడుతుంది.అందువల్లే, 30 సంవత్సరాలు దాటిన తరువాత క్యాలరీలు ఎక్కువగా తీసుకోకపోయినా పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుంది. ఇదే ఆహారం ఒకప్పుడు మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచినా 30 సంవత్సరాల వయసు తరువాత అదే కొవ్వు గా మారడం మొదలవుతుంది. అందువల్ల 30 దాటగానే శారీరక శ్రమని కాస్త పెంచి క్యాలరీలు తీసుకోవడం కొంచమైనా తగ్గిస్తే మంచిది.
1. లైంగిక ఆరోగ్యాన్నికాపాడుకోవడం
30 యెళ్ళు దాటగానే మీలో టెస్టోస్టీరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అందువల్ల మీ శ్రుంగారేచ్చని కాపాడుకోవడానికి చెయ్యాల్సినదంతా చెయ్యలి.ఒకవేళ మీకు ధూమపానం అలవాటుంటే తక్షణమే మానుకోవడం మంచిది. ఎందుకంటే ధూమపానం మీ శ్రుంగార జీవితాన్ని నిస్సారం చేసెస్తుంది.
2. రోడ్డుపక్కన అమ్మే తినుబండారాలు తినడం
మీరు వయసులో ఉన్నప్పుడూ మీ శరీరం దేనినైనా జీర్ణం చేసుకోగలదు. కానీ మీకు 30 యేళ్ళు తర్వాత మీరు ఇలాంటి పదార్ధాలని ఎంత నివారిస్తే అంత మంచిది. మీ రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతు సంబంధిత ఇంఫెక్షన్లు,గ్యాస్ట్రిక్ లాంటి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ.
3. అమిత మద్యపానం
మద్యాన్ని మితంగా తీసుకుంటే వచ్చే ముప్పేమీ లేదు. ఒకవేళ మీరు విందులు వినోదాల పేరుతో మద్యాన్ని అమితంగా తాగేవారయితే 30 యేళ్ళు దాటినా ఇంకా అలా తాగుతున్నారంటే అది మీ మానసిక స్థితికి నిదర్శనం. ఒక్కోసారి ఈ అలవాటు వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
4. వీడియో గేమ్స్
వీడియో గేంస్ వ్యసనం మీ మేధాశక్తిని కుంటుపడేటట్లు చేస్తుంది. చిన్న పిల్లలు ఇవి మితంగా ఆడుకోవచ్చు కానీ 30 యేళ్ళు దాటిన మీరు వ్యసనంతో అలా గంటలు గంటలు కూర్చోవడం వల్ల మీ కళ్ళ ఆరోగ్యం మరియు మీ కీళ్ళ ఆరోగ్యాన్ని పణం గా పెట్టవలసి వస్తుంది.
5. జంక్ ఫుడ్
30 యెళ్ళ తరువాత కూడా మీకు మీ ఆరోగ్యం పట్ల స్ప్రుహ లేకపోతే ఒబేసిటీ లేదా హ్రుదయ సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కబళించ వచ్చు.
6. అతిగా టీవీ చూడటం
గంటల తరబడి కనీసం లేవకుండా టీవీ చూడటం ఒక మానసిక రుగ్మత. 30 యేళ్ళు దాటాకా మీ ఆరోగ్యం కోసం అలాంటి రుగ్మత లకి దూరం గా ఉండటం మేలు.
7. రాత్రిళ్ళు లేటు గా పడుకోవడం:
30 యేళ్ళ తరువాతా మీ శరీరం స్థిమిత పడాలి. అందువల్ల నిర్ణీత వేళకి తిని పడుకోవడం చాలా ముఖ్యం ఈ వయసులో నిద్ర లేమి అనేక ఆరోగ్య సంబంధిత కారణాలకి హేతువు.
8. భోజనం మానెయ్యడం:
మీరేమీ టీనేజర్ కాదు కదా రోజంతా శక్తివంతంగా ఉండటానికి. పొరపాటున కూడా 30 యేళ్ళు దాటగానే ఒక్కపూట కూడా భోజనం మానొద్దు.
9. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ:
చాలా మంది మహిళలు 30 దాటగానే తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు.ఇది చాలా పొరపాటు. ఆడవారైనా మగవారైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

మహిళలకు కావాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు..

 

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి కావలసింది సమతులాహారం.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. స్త్రీ, పురుషుడు అని తేడా లేకుండా ప్రతి స్టేజిలో న్యూట్రిషన్ ఫుడ్ అవసరమవుతుంది. కానీ ఇంటిపనులను చూసుకొంటూ, పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్నీ పనులు చేయడం, ప్రతీ రోజూ చేస్తూ అలసి పోయే స్త్రీలకుతమ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం పదార్థాలు …బీన్స్ ,పాలు, ఓట్స్ ,అవిసె గింజలు,టొమాటో,చేపలు ,తోటకూర,కెరోటినాఎడ్స్,క్యారోట్,కాలి ఫ్లవర్స్

For Healthy and Beautyful Skin Follw these Rures

 

ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..

1. మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.

2. జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.

3. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది.

4. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.

5. మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.

6. బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించడం మంచిది. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.

7. నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.

8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.