Friday, 28 August 2015

మొక్క‌జొన్న‌- ప్ర‌యోజ‌నాలు



మొక్కజొన్న చూస్తే కొందరికి ముఖం ముడతలు పడుతుంది. మరీ అంత ఎక్కువగా ఏమి తినరు. కానీ మొక్కజొన్న రోజువారి ఆహారంలో భాగమైతే ఎంతబాగుంటుందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొవ్వు పదార్థాలను తగ్గిస్తుందట. బలానికి బలం చేకూర్చుతుందట. ఇంకా ఎన్నెన్నో మేళ్ళు.. వివరాలిలా ఉన్నాయి.

 

ర‌తిరోజూ మొక్క‌జొన్న‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా మొక్క‌జొన్న‌ల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి నియంత్రిస్తాయట.
అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వ‌ల్ల చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు కూడా ఎంతో మంచిందట. జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రిచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. ర‌క్త‌లేమిని త‌గ్గిస్తాయి. ఇన్ని సలక్షణాలు ఉన్న మొక్కజొన్న రోజూ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి..? లెటజ్ ట్రై…!

అగరుబత్తీల పొగతో పొంచివున్న ప్ర‌మాదం


చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత కల్పించే అగరుబత్తీల పొగ ఊపిరిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను చేరుస్తోందట.

అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం జరిపారు.

అగరుబత్తీల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు ఉన్నట్లు తేలిందన్నారు.

వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని వీరు వివరించారు.

అగరబత్తీల నుంచి పొగతో పాటు గాలిలో కలిసిన రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరి వాపునకు దారితీస్తాయని వివరించారు. దీంతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్‌, చైల్డ్‌ హుడ్‌ లుకేమియా, బ్రెయిన్‌ ట్యూమర్‌ కు కారణమవుతోందని తెలిపారు.

తులసి ఆకులు, రాళ్ల ఉప్పుతో జలుబుకు చెక్

 

వయస్సులో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మందికి సోకే వ్యాధి జలుబు. జలుబు పట్టిందంటే ఒక పట్టాన పోదు. అంతేకాకుండా అది అంటు వ్యాధి కావడంతో మన నుంచి ఇతరులకూ ప్రబలే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి జలుబు పట్టిందంటే అది త్వరగా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది. జలుబును అలక్ష్యం చేస్తే అనేర రకాల ఇన్ ఫెక్షన్ లు సోకే ప్రమాదం ఉంది. కనుక జలుబు విషయంలో అజాగ్రత్తగా కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
1. జలుబును తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది.
2. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది.
3. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పని చేస్తుంది. ప్రతి రోజూ మూడు పూటలా మూడు చుక్కల జిందా తిలిస్మాత్ ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గుతుంది.
4. రాత్రి పూట పడుకునే ముందు వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు తగ్గు ముఖం పడుతుంది.
5. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి, బాగా మరిగించి, తర్వాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. అదే విధంగా అల్లం ముక్కలను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని, దానికి కాస్త జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
6. జలుబు నుంచి రిలీఫ్ పొందినా.. దగ్గు మాత్రం అంత తొందరగా వదిలి పోదు. దగ్గును అరికట్టడంలో కరక్కాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. కరక్కాయ ముక్కలను దవడ కింద ఉంచుకుని ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశపనం పొందవచ్చు.

జామ ఆకులతో ఆరోగ్య చిట్కాలు

 

చాలా మంది జామపండును ఇష్టపడతారు. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా, చాలా రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, మనలో చాలా మందికి, జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.
1.శరీరబరువును తగ్గిస్తుంది
జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులుస్ కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.
2. మధుమేహులకు ఉరట
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.
3. గుండె సంబంధిత సమస్యల నుండి విముక్తి
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.
4. డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం
డయేరియా & రక్త విరేచనాలను తగ్గించుటలో జామ ఆకులు శక్తివంతమైన హెర్బల్ ఔషదంగా పని చేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో ఒక పిడికెడు బియ్యపు పిండి మరియు 30 గ్రాముల జామ ఆకులను వేడి చేయండి. రోజు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగటం వలన విరేచనల నుండి ఉపశమనం పొందుతారు. రక్త విరేచనలను తగ్గించుటకు- 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జామ వేర్లను మరియు ఆకులను కలిపి 20 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి, రక్త విరేచనాలు తగ్గే వరకు రోజు తాగండి.
5. జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ, జీర్ణాశయంలో, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. జామ ఆకులు కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, జీర్ణాశయ గోడలపై ఉండే హానికర బ్యాక్టీరియాను మరియు వాటి నుండి విడుదలయ్యే రసాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. జామ ఆకులు వాంతులు మారియు డోకుల నుండి తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.

ఎదురులేని జమైకా చిరుత


బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ జోరు కొనసాగుతోంది. మొన్న 100 మీ పరుగులో సత్తా చాటిన బోల్ట్, తాజాగా, 200 మీ పరుగుపందెం ఫైనల్లో విజేతగా నిలిచాడు. 19.55 సెకన్లతో రేసు పూర్తి చేసిన ఈ జమైకా చిరుత మరోసారి జస్టిన్ గాట్లిన్ ను రెండోస్థానానికి పరిమితం చేశాడు. గాట్లిన్ 19.74 సెకన్లతో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 100 మీ స్ప్రింట్ ఫైనల్లోనూ గాట్లిన్… బోల్ట్ ధాటికి నిరాశకు గురికాక తప్పలేదు.

అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ ‘స్పాట్ ఫిక్సింగ్’ ఆటగాళ్లు


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ ముగ్గురు పాక్ క్రికెటర్లు మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్నారని పీసీబీ పెద్దలు అంటున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్, మహ్మద్ అమీర్ పై విధించిన నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుంది. 2010లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడిన సందర్భంగా వీరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఓ స్థానిక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. వీడియో పుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వీరు ముగ్గురికి ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. సెప్టెంబర్ 1తో వీరిపై నిషేధం ముగియనుండడంతో లాహోర్ లోని హెడ్ ఆఫీస్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. త్వరలో పీసీబీ వారిని మళ్లీ క్రీజులోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.

బింద్రా శిక్షణకు కేంద్ర సాయం

 

ఒలింపిక్ ప్రముఖ షూటర్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా కోరిన ఆర్థికసాయానికి కేంద్రం అంగీకరించింది. అభినవ్ తన తదుపరి పోటీలకోసం జర్మనీలో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఇందుకోసం తనకు ఆర్థికంగా సహకారం అందించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్ర క్రీడాశాఖ నేడు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చింది. టాప్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం) పథకం కింద నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 5000 యూరోలను అభినవ్‌ కు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అభినవ్ సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు.